• రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై క్యాబినెట్లో సమగ్రమైన చర్చ జరిగింది
ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర యొక్క ఆదాయంలో 15.3శాతం వృద్ధి రేటు నమోదైనట్లు అధికారులు తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర యొక్క ఆదాయంలో 15.3శాతం వృద్ధి రేటు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
• అయితే, కేంద్రం ప్రభుత్వం నుంచి సీఎస్ఎస్, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు మైనస్ -12.9 శాతం తగ్గినప్పటికీ ఈ వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హమని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు.
• ముఖ్యంగా కేంద్రం నిధులు విడుదల చేయడంలో S.N.A. అకౌంట్లు అనే కొత్త పద్ధతి తేవడం ద్వారా రాష్ట్రాలకిచ్చే నిధులలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నది. అంతేకాక ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితులను సకాలంలో ఇవ్వకుండా పోవడం మరియు పరిమితుల్లో కూడా కోతలు విధించడం జరిగింది.
ఎప్.ఆర్.బి.ఎంలో కోతలు విధించకుండా ఉండి ఉంటే రాష్ట్రం యొక్క ఆదాయం మరింతగా పెరిగి, దాదాపు 22శాతం వృద్ధిరేటు నమోదయ్యేది.
• సీ.ఎస్.ఎస్.లో గత 8 సంవత్సరాల్లో రాష్ట్రానికి 47,312 కోట్లు నిధులు మాత్రమే వచ్చాయని ఆర్థికశాఖ వివరించింది.
• అయితే, గత నాలుగు సంవత్సరాల్లో ఒక్క రైతుబంధు పథకం కింద రైతులకు 58,024 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించడం జరిగిందని ఆర్థికశాఖ అధికారులు క్యాబినెట్ కు వివరించారు.
• గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రప్రభుత్వం 1 లక్ష 84 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా అందులో సీఎస్ఎస్ పథకాల కింద అందింది రూ.5200 కోట్లు మాత్రమే. అంటే మొత్తం రాష్ట్రం పెట్టిన ఖర్చులో 3శాతం కంటే తక్కువ మాత్రమే కేంద్ర పథకాల కింద నిధులు అందాయి.