అండర్‌-19లో రాణించిన ప్రకాశం జట్టు

ఒంగోలు క్రీడా విభాగం: ఒంగోలు శర్మా కళాశాల మైదానంలో జరుగుతున్న అండర్‌-19 క్రికెట్‌ పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ప్రకాశం జట్టు విజయావకాశాలు మెరుగు పర్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైన ప్రకాశం జట్టు పశ్చిమ గోదావరి జట్టును 103 పరుగులకే అలౌట్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసి 225 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.