మహబూబ్‌నగర్,మార్చి4 (జనం సాక్షి ) : అన్ని కులాలు, మతాలను సమానంగా చూసే వ్యక్తి మంత్రి శ్రీనివాస్ గౌడ్, అలాంటి వ్యక్తిని హత్య చేసేందుకు బీజేపీ నాయకులు కుట్రపన్నడం దారుణమని జిల్లా రెడ్డి సంఘం నాయకులు అన్నారు. జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో మంత్రి పై జరిగిన హత్య కుట్రకు నిరసనగా విూడియా సమావేశంలో రెడ్డి నాయకులు మాట్లాడారు. మంత్రి జిల్లా అభివృద్ధి కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని అంతమొందించాలని కుట్రపన్నడం హేయమైన చర్యగా అభివర్ణించారు. నిందితులకు ఆవాసం కల్పించిన బీజేపీ నేత జితేందర్ రెడ్డి కూడా చట్ట ప్రకారం నిందితుడే అన్నారు. అకామిడేషన్‌కు షెల్టర్‌కు తేడా ఏంటో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కిడ్పాప్ జరిగిందని ధర్నాలు చేసేది విూరే.. వాళ్లకు షెల్టర్ ఇచ్చేది విూరే.. అరెస్ట్ జరిగిందని నిందితులను గురించి మాట్లాడుతుంది విూరే అని బీజేపీ నేతల తీరును విమర్శించారు. రెడ్డి సంఘం తరపున ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Other News
- టిఆర్ఎస్ పాలనే తెలంగాణకు రక్ష
- కాంగ్రెస్ పార్టీకి ఊహించని బిగ్ షాక్
- కొండగట్టులో ఘనంగా హనుమత్ జయంతి
- వానాకాలం పంటల సాగుకు యాక్షన్‌ప్లాన్
- అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు
- కోనసీమలో నిఘా వైఫల్యం
- కంటి సమస్యలుంటే రంది పడొద్దు: మంత్రి హరీష్ రావు భరోసా
- *బీసీ యువతకు నైపుణ్యాభివ్రుద్ది కార్యక్రమాలను రూపొందించిన బీసీ సంక్షేమ శాఖ*
- *సి పి ఎస్ రద్దు చేసినందుకు, శ్రీ అశోక్ గెహ్లాట్ కు సెల్యూట్*
- *రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుని మృతి, అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు*