అందరి దృష్టిని ఆకర్శిస్తున్న కామారెడ్డి

ఇద్దరు హేమాహేవిూల పోటీతో పెరిగిన ప్రాధాన్యం
ఉమ్మడి జిల్లాలో ప్రభావం చూపుతున్న ప్రచారం
బిఆర్‌ఎస్‌ మోసపూరిత హావిూలను నమ్మరన్న షబ్బీర్‌ అలీ
కామారెడ్డి,నవంబర్‌13((జనంసాక్షి): గతంలో ఎప్పుడూ లేనంతగా కామారెడ్డికి ప్రాధాన్యం ఏర్పడిరది. ఇక్కడి నుంచి బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ పోటీ చేయడం, ఆయనపై పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పోటీ పడడంతో దీనికి ఎక్కడ లేని ప్రాధాన్యం ఏర్పడిరది. దీంతో దేశం యావత్తూ ఇప్పుడు ఇక్కడి ఎన్నికపై చర్చ సాగుతోంది. కామారనెడ్డిలో కెసిఆర్‌ ఎందుకు పోటీ చేస్తున్నారన్నది ఒకటయితే…ఎవరు గెలుస్తారన్న దానిపై ఆసక్తి పెరిగింది. నామినేషన్ల పక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే
కెసిఆర్‌, కెటిఆర్‌లు ప్రచరాం నిర్వహించారు. రోజువారీ ప్రచారం సాగుతోంది. పిసిసి చీఫ్‌ రేవంత్‌ పదిన నామినేషన్‌ వేయచడంతో పాటు, బిసి డిక్లరేషన్‌ను ఇక్కడి నుంచే విడుదల చేశారు. ప్రజలు కూడా ఇక్కడి ఎన్నికపై ఆసక్తిగా ఉన్నారు. ఇకపోతే ఈ కామరెడ్డి ప్రభావం ఇతర ప్రాంతాలపైనా పడనుంది. దీంతో కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌లో పోటాపోటీగా ప్రాచరం చేస్తున్నారు. కొందరు నాయకులు తమవంతుగాప్రచారం రోజువారీ ప్రచారంలో సాగుతున్నారు. టికెట్‌ వచ్చి, నామినేషన్లు వేసిన వారు చురకుగా ప్రాచరంలో దూసుకుపోతున్నారు. కామారెడ్డిలో కేసీఆర్‌(బీఆర్‌ఎస్‌), రేవంత్‌రెడ్డి(కాంగ్రెస్‌), వెంకటరమణారెడ్డి (బీజేపీ), ఎల్లారెడ్డిలో మదన్‌మోహన్‌రావు (కాంగ్రెస్‌), జాజాల సురేందర్‌(బీఆర్‌ఎస్‌), వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి(బీజేపీ), జుక్కల్‌లో తోట లక్ష్మీకాంతరావు (కాంగ్రెస్‌),హన్మంత్‌షిండే (బీఆర్‌ఎస్‌), అరుణతార (బీజేపీ), బాన్సువాడ లో పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌), ఏనుగు రవీందర్‌రెడ్డి (కాంగ్రెస్‌), యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ)లతో పాటు, ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎవరు బరిలో ఉంటారో తెలుస్తుంది. ఆయా చోట్ల ప్రధాన పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న లీడర్లతో క్యాండిడేట్లు చర్చలు జరుపుతున్నారు. ఎల్లారెడ్డి టికెట్‌ మదన్‌ మోహన్‌రావుకు కేటాయించగా వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి వర్గం నారాజ్‌గా ఉంది. వీరితో మదన్‌ మోహన్‌రావు చర్చలు జరిపారు. కొందరు లీడర్లు, కార్యకర్తల ఇండ్లకు వెళ్లి మద్దతు ఇవ్వాలని కోరి, ప్రచారానికి వచ్చేలా చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌అభ్యర్థి జాజాల సురేందర్‌ కూడా పలువురు లీడర్లతో మాట్లాడి వీరిని చురుకుగా పాల్గొనేలా చేశారు. బీజేపీ తరఫున పోటీలో ఉన్న సుభాష్‌రెడ్డి కూడా పలువురిని కలిసి మద్దతు కూడగడుతున్నారు. జుక్కల్‌లో కాంగ్రెస్‌ టికెట్‌  కోసం మాజీ ఎమ్మెల్యే
గంగారాం, ఎన్‌ఆర్‌ఐ తోట లక్ష్మీకాంత్‌ రావు ఆశించగా చివరకు అధిష్టానం లక్ష్మీకాంతారావు వైపు మొగ్గు చూపింది. గంగారం బరిలో ఉంటానని ప్రకటించిన నేపథ్యంలో లక్ష్మీకాంత్‌ రావు గంగారం వర్గంతో చర్చలు జరిపి మద్దతు కోరుతున్నారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి బాన్సువాడ టికెట్‌ దక్కించుకోగా, టికెట్‌ ఆశించిన బంగపడ్డ కాసుల బాల్‌ రాజు అసంతృప్తితో ఉన్నారు. ఆమరణ దీక్షకు దిగడంతో పాటు, పురుగుల మందు తాగి సూసైడ్‌ అటెంప్ట్‌  చేశారు. ఈయనతో పార్టీ సీనియర్‌  లీడర్లు సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లోని ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని మమ్మరం చేశారు. కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల తరఫున నిర్వహించిన బహిరంగ సభల్లో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ నెల15న ఆయన ఎల్లారెడ్డికి రానున్నారు. కామారెడ్డిలో నామినేషన్‌  వేసిన తర్వాత శుక్రవారం రేవంత్‌ రెడ్డి బహిరంగ సభ నిర్వహించారు. ఆయన తరఫున ఆ పార్టీ లీడర్లు గ్రామాల్లో ప్రచారం చేయనున్నారు. ఎల్లారెడ్డిలో ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థి మదన్‌ మోహన్‌రావు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు.  జుక్కల్‌లో  తోట లక్ష్మీకాంతారావు తన ప్రచారాన్ని స్పీడప్‌? చేశారు. బాన్సువాడలో ఏనుగు రవీందర్‌?రెడ్డి ఆయా మండలాల్లోని కాంగ్రెస్‌ లీడర్లు, కార్యకర్తలతో విూటింగ్‌లు నిర్వహించి మద్దతు కోరారు. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి కొన్ని నెలలుగా గ్రామాల్లో తిరుగుతున్నారు. ఇటీవల కిషన్‌రెడ్డి ఇక్కడికి వచ్చి కార్యకర్తల్లో జోష్‌నింపారు. జుక్కల్‌లో అరుణతార చాలా రోజులుగా నుంచి గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఎల్లారెడ్డి టికెట్‌ దక్కించు కున్న వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి ప్రచారాన్ని షురూ చేశారు. బాన్సువాడలో యెండల లక్ష్మీనారాయణ మండలాలు, గ్రామాల వారిగా లీడర్లు, కార్యకర్తలతో విూటింగ్‌లు ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రచారానికి సిద్ధమయ్యారు. మొత్తంగా కెసిఆర్‌, రేవంత్‌లు పోటీలో ఉండడంతో ఉమ్మడి జిల్లాలో ప్రచార హోరు పెరిగింది. దీని ప్రభావం కూడా ఆయా నియోజకవర్గాలపై పడనుంది.ఇకపోతే కామారెడ్డిలో రేవంత్‌ రాకతో షబ్బీర్‌ అలీ నిజామాబాద్‌ అర్బన్‌కు మారారు. ఆయనకూడా ప్రశ్నలు సంధిస్తూ ముందుకు సాగుతున్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇస్తానని సీఎం కేసీఆర్‌ మోసం చేశారని అభ్యర్థి షబ్బీర్‌ అలీ విమర్శించారు. గతంలో కాంగ్రెస్‌ గవర్నమెంట్‌ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్‌తో ఇప్పుడిప్పుడే డాక్టర్లు, ఇంజినీర్లుగా ముస్లిం యువకులు బయటకు వస్తున్నారన్నారు. ఆ రిజర్వేషన్‌లోనూ ఒక శాతం కోతపెట్టి బీఆర్‌ఎస్‌ సర్కారు అన్యాయం చేస్తోందన్నారు.  మైనార్టీబంధులో 30 శాతం కవిూషన్‌ తీసుకుంటున్న మంత్రి కేటీఆర్‌కు ముస్లిం డిక్లరేషన్‌పై మాట్లాడే హక్కులేదన్నారు.తమ హయాంలో రేషన్‌ దుకాణాల్లో తొమ్మిది రకాల వంట సామాన్లు ఇచ్చేవాళ్లమని, ఇప్పుడు బియ్యం తప్ప ఏవిూ ఇవ్వడం లేదన్నారు. ఈ సారి కచ్చితంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని, ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. నిరుద్యోగ యువత ఇంటింటికి వెళ్లి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. డబ్బుతో గెలువాలనుకుంటున్న లీడర్లకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
““““““““`