అక్రమం సబంధంతో వ్యక్తి హత్య

share on facebook

మహబూబాబాబాద్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): మహబూబాబాబాద్‌ జిల్లాలోని బయ్యారం మండలంలో దారుణం జరిగింది. మండలంలోని కొత్తపేటలో ఉన్న ఇటుక బట్టీ వద్ద తోటి కూలీ చేతిలో ఓ కూలీ హత్యకు గురయ్యాడు. ఒడిశాకు చెందిన డమ్రూ మాజి (45) కొత్తపేటలోని ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో మరో కూలీ లాంగ్వా భార్యతో అతడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. లాంగ్వా వారిద్దరిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ క్రమంలో డమ్రూను కాళ్లు, చేతులు కట్టేసి కర్రతో కొట్టి చంపాడు. విషయం తెలుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్య కరుణావత్‌ అడ్డు రావటంతో తలపై గాయపరిచాడు. మృతుడు డంబ్రూమాజి(25)గా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Other News

Comments are closed.