అక్రమ రవాణా కు అడ్డాగా మారిన… బోరాజ్ చెక్ పోస్ట్.

మామూళ్ళ మత్తులో అధికారులు..?
* మూడు పవ్వులు… ఆరు కాయలుగా సాగుతున్న వ్యాపారం.
* రేషన్ మాఫియాకు అధికారుల పూర్తి అండ దండాలు..?
ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : రాష్ట్ర ప్రభుత్వం దారిద్ర రేఖ కు దిగువునా ఉన్న వారికీ రేషన్ కార్డు లు ఇచ్చి ఒకరుపయికి కిల్లో బియ్యం ఇస్తున్న విషయం తెలిసినదే. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. అయితే ఇక్కడే అసలు విషయం మొదలైంది. జిల్లాలో ప్రతి రోజు పదూల సంఖ్యలో లారీలలో అక్రమ బియ్యం మహారాష్ట్ర కు తరలిపోతున్నాయి.రేషన్ మాఫియాకు అధికారుల అందదండాలు లేకపోలేదు. రేషన్ మాఫియా జిల్లా మొత్తంగా విస్తరించింది. ఇటు జిల్లా కేంద్రం తో పాటుగా ఇచ్చోడా. ఇంద్రవెల్లి. సిసి ఐ ప్రాంతాలలో అడ్డలను ఏర్పార్చుకొని ప్రజల నుండి బియ్యని అక్కడికి తరలించి సమయం చూసి లారీలలో బోరాజ్ చెక్ పోస్ట్ గుండా మహారాష్ట్ర కు తరలిపోతున్నాయి. అయితే అధికారులతో ముందుగానే మాట్లాడి వారికీ మాములు ముట్టచెప్పి లారీలలో బియ్యని మహారాష్ట్ర కు తరలిస్తారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది అంత ఓ ప్రయివేటు వ్యక్తి కానుసైగలో జరుగడం ఇప్పుడు చర్చనియంగా మారింది.