అగ్రికెమ్‌ రసాయనాల నిర్వీర్యం పూర్తి

శ్రీకాకుళం, జూలై 22 : నాగార్జున అగ్రికెమ్‌ పరిశ్రమలో రసాయనాలను నిర్వీర్యం ప్రక్రియ పూర్తయిందని పర్యావరణ ఇంజనీర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. 1,2,3,4,6 బ్యాకుల్లో రసాయనాలు నిర్వీర్యం చేశారుని, రియాక్టర్ల వాషింగ్‌ ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రమాదం జరిగిన 5వ బ్లాక్‌లో కాలిపోయిన రసాయనాలను కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల ప్రకారం యాజమాన్యమే తరువాత తొలగిస్తుందన్నారు. 24వ తేదీ నుంచి పరిశ్రమకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామన్నారు.