మారిషస్‌ భారత్‌కు కీలక భాగస్వామి: ` ప్రధాని మోదీ


పోర్ట్‌ లూయీ(జనంసాక్షి): మారిషస్‌ తమకు కీలక భాగస్వామి అని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అలాగే 140 కోట్ల మంది భారతీయుల తరఫున మారిషస్‌ ప్రజలకు నేషనల్‌ డే శుభాకాంక్షలు తెలియజేశారు.’’నేషనల్‌ డే రోజున మరోసారి విూముందు ఉండటం నా అదృష్టం. మన రెండు దేశాలను అనుసంధానించేది హిందూ మహాసముద్రం మాత్రమే కాదు. సంస్కృతి, సంప్రదాయాలు మనల్ని కలిపి ఉంచుతున్నాయి. ఈ రెండు దేశాల బంధాన్ని ‘మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య’ హోదాకు తీసుకెళ్లాలని ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాం, నేను నిర్ణయించాం. మారిషస్‌లో కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణానికి భారత్‌ సహకరించనుంది. ప్రజాస్వామ్యానికి తల్లి వంటి భారత్‌ నుంచి మారిషస్‌కు ఇదొక కానుకగా భావిస్తున్నాం’’ అని మోదీ అన్నారు. ’’పది సంవత్సరాల క్రితం ‘సెక్యూరిటీ అండ్‌ గ్రోత్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ ది రీజియన్‌’కు మారిషస్‌ నుంచే పునాది వేశాం. ఈ ప్రాంత శ్రేయస్సు, స్థిరత్వం కోసం సాగర్‌ విజన్‌తో ముందుకొచ్చాం. గ్లోబల్‌ సౌత్‌ దేశాల కోసం మహాసాగర్‌ విజన్‌ను ప్రకటిస్తున్నాం. వాణిజ్యం, పరస్పర భద్రత అంశాలపై దానికింద పనిచేస్తాం’’ అని మోదీ వెల్లడిరచారు. ఈ ప్రాంతంలో చైనా తన ప్రభావాన్ని విస్తరించేందుకు చేస్తోన్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ మహాసాగర్‌ ప్రకటన వచ్చింది. నవీన్‌చంద్ర రామ్‌గులాం మాట్లాడుతూ.. ‘’నేషనల్‌ డే వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ మా దేశంలో పర్యటించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం. ఆయన రాక రెండు దేశాల బంధానికి నిదర్శనం’’ అని అన్నారు. ఇద్దరు ప్రధానుల భేటీ అనంతరం ఈమేరకు సంయుక్త విూడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సమావేశం అనంతరం పోర్ట్‌ లూయీలోని చాంప్‌ డి మార్స్‌ వద్ద మారిషస్‌ నేషనల్‌ డే వేడుకల్లో ముఖ్యఅతిథిగా మోదీ పాల్గొన్నారు. ఆ వేడుకలు వీక్షించేందుకు అక్కడికి వచ్చిన పలువురు ప్రజలు జైశ్రీరామ్‌, భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ ఈవెంట్‌లో ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌, నౌకాదళానికి చెందిన హెలికాప్టర్‌, నౌకాదళం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.