ఐదు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

` నిబంధనల మేరకు లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఐదు స్థానాలకు 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి అద్దంకి దయాకర్‌, విజయశాంతి, శంకర్‌నాయక్‌, భారాస నుంచి దాసోజు శ్రవణ్‌, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం ఎన్నికయ్యారు. వీరు కాకుండా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు నిబంధనల మేరకు లేకపోవడంతో రిటర్నింగ్‌ అధికారి వాటిని తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. దీంతో ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. దాసోజు శ్రవణ్‌ ఎట్టకేలకు చట్టసభలో ప్రవేశించే అవకాశం దక్కించుకున్నారు. గతంలో గవర్నర్‌ కోటాలో దాఓజును నామినేట్‌ చేసినా ఆనాటి గవర్నర్‌ తమిళసై తిరస్కరించడంతో ఆయన అవకాశం కోల్పోయారు.