పాక్‌లో రైలు హైజాక్‌ ..

200 మందిని బంధించిన మిలిటెంట్లు
` 30 మంది బలోచ్‌ వేర్పాటువాదులను హతమార్చిన బలగాలు
లాహోర్‌,మార్చి12(జనంసాక్షి):పాకిస్థాన్‌లో రైలు హైజాక్‌ ఘటనలో బలోచ్‌ వేర్పాటువాదుల చెర నుంచి దాదాపు 190 మంది ప్రయాణికులను భద్రతాబలగాలు రక్షించాయి. అలాగే 30 మంది మిలిటెంట్లను మట్టుపెట్టాయని స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే మిలిటెంట్లు ఐదు వేర్వేరు ప్రాంతాల్లో 200 మందిని బంధించినట్లు పాకిస్థాన్‌ ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. బలోచిస్థాన్‌ ప్రావిన్సులోని పర్వతప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్‌కు జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ (ఏజౌజీస ఇలూస।బబ) వెళ్తున్న సమయంలో ఈ హైజాక్‌ ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రైల్లోని తొమ్మిది బోగీల్లో 400 మంది ప్రయాణికులున్నారు. అలాగే రైల్లో ఉన్న బలోచ్‌ మిలిటెంట్లు చిన్న బృందాలుగా విడిపోయి ఉండటంతో.. ఆపరేషన్‌ కష్టతరంగా మారినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. బలోచ్‌ తిరుగుబాటుదారులు అఎª`గానిస్థాన్‌లోని తమ కీలక నేతతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల సహాయ మంత్రి వెల్లడిరచారు. హైజాక్‌లో మొత్తం 70 నుంచి 80 మంది వేర్పాటువాదులు పాల్గొన్నారంటూ విూడియాతో మాట్లాడారు. ఈ ఘటన నేపథ్యంలో బలోచిస్థాన్‌కు రాకపోకలు సాగించే అన్ని రైళ్లను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.సైన్యం కిడ్నాప్‌ చేసిన రాజకీయ ఖైదీలు, ఉద్యమకారులు, అదృశ్యమైన వ్యక్తులను 48 గంటల్లోగా విడిచిపెట్టాలని బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ డిమాండ్‌ చేస్తోంది. లేకపోతే తమ బందీలుగా ఉన్న వారిని చంపేస్తామని బెదిరిస్తోంది. అంతేకాదు.. రైలును కూడా ధ్వంసం చేస్తామని చెబుతోంది.