డీలిమిటేషన్‌పై ఢల్లీిని కదలిద్దాం రండి
` సీఎం రేవంత్‌కు, కేటీఆర్‌కు స్టాలిన్ లేఖ
` జేఏసీ సమావేశానికి రావాలంటూ ముఖ్యమంత్రికి డీఎంకె నేతల వినతి
` పార్టీ ఆదేశాలు తీసుకుని వస్తానని వెల్లడిరచిన సీఎం
` తెలంగాణలో అంతకుముందే అఖిలపక్ష భేటీ
` కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికీ ఆహ్వానం
న్యూఢల్లీి(జనంసాక్షి): ఢల్లీి పర్యటనలో ఉన్న రేంవత్‌ని 22న జరగనున్న జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి హాజరు కావాలని తమిళనాడు డీఎంకే నేతలు ఆహ్వానించారు. ఈ క్రమంలో జేఏసీ సమావేశానికి రేవంత్ రెడ్డి రావాలని డీఎంకే ఎంపీలు కనిమొళి, రాజా, ఎన్. ఇలాంగో, కళానిధి వీరస్వామి సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. స్టాలిన్ డీలిమిటేషన్ విషయంలో చూపిన చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. తమిళనాడులో సమావేశానికి హాజరయ్యేందుకు ఏఐసీసీ అనుమతి తీసుకుని వస్తామన్నారు. డీలిమిటేషన్ పక్రియ దక్షిణాది రాష్టాల్రపై ప్రభావం చూపుతుందని, ఉత్తరాది రాష్టాల్ర కంటే ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నాయని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు తీసుకుని డిఎంకె నిర్వహించే జెఎసి సమావేశానికి హాజరవుతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్టాల్రకు తీవ్రఅన్యాయం జరుగబోతోందని అన్నారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ కూడా అఖిలపక్ష భేటీని ఏర్పాట చేసిందన్నారు. దీనికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కూడా ఆహ్వానించామని అన్నారు. కేంద్ర కేబినేట్‌లో ఉన్న కిషన్ రెడ్డి దక్షిణాది రాష్టాల్ర ఇబ్బందులను కేంద్రానికి తెలియచేయాల్సి ఉందన్నారు. తెలంగాణలో కూడా డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రావాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి తన అభిప్రాయాలను కేంద్ర క్యాబినెట్‌లో వినిపించాల్సిన అవసరం ఉందని రేవంత్ ప్రస్తావించారు. తెలంగాణలోని అన్ని పార్టీలు కూడా ఆ సమావేశంలో పాల్గొనాలని కోరారు. ఈ క్రమంలో డీలిమిటేషన్ పై మార్చి 22న జరుగనున్న జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రికి ఆహ్వానం అందింది. తమిళనాడులో జరగనున్న ఈ సమవేశానికి పలు ప్రాంతీయ పార్టీలు హాజరై డీలిమిటేషన్ పై వారి అభిప్రాయాలను తెలియజేయనున్నాయి. ఇప్పటికే డీలిమిటేషన్ పై తమిళనాడు డీఎంకే నేతలు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ పక్రియ తమ రాష్ట్రంలో ప్రజల హక్కులను హరించే దిశగా ఉందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ కూడా ఈ అంశంపై చర్చిస్తామన్నారు. దీంతో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ముఖ్యమైన చర్చలకు ఒక వేదికగా నిలిచే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, ఆంధప్రదేశ్ వంటి ప్రాంతాల ప్రగతికి సంబంధించిన నిర్ణయాలను తీసుకునేందుకు కీలక అంశంగా మారనుంది. డీలిమిటేషన్ వల్ల వచ్చే రాజకీయ పరిణామాలు, రాష్టాల్ర మధ్య సంబంధాలు, వాస్తవాలపై ప్రాధాన్యం కలిగిన అనేక అంశాలపై చర్చలు జరగనున్నాయి. అయితే ఈ భేటీకి మరికొన్ని రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మరిన్ని రాష్టాల్రు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆహ్వానం అందింది.. హాజరవుతాం
` దక్షిణాది రాష్ట్రాల జేఏసీ సమావేశంలో పాల్గొంటామన్న కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి): మార్చి 22న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తలపెట్టిన దక్షిణాది జేఏసీ సమావేశానికి భారాస పార్టీని తమిళనాడు ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు అక్కడి పులపాలక శాఖ మంత్రి నెహ్రూ, డీఎంకే ఎంపీ ఇలంగో గురువారం హైదరాబాద్ వచ్చి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసి ఆహ్వానించారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై అందరం కలిసి పోరాడుదామని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘గత కొన్నేళ్లుగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటిస్తూ జనాభాను అదుపులో ఉంచాయి. ఇప్పటికిప్పుడు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు అన్యాయానికి గురవుతాయి. 22న జరిగే సమావేశానికి హాజరవుతాం. సమష్టిగా పోరాడితే దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. తమిళనాడు ప్రభుత్వానికి సంస్కారం ఉంది కాబట్టి తెలంగాణకు వచ్చి ఆహ్వానించారు. మరి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి’’ అని కేటీఆర్ అన్నారు. సమావేశానికి హాజరవుతామని భారాస తరఫున కేటీఆర్ స్పష్టం చేయడంతో తమిళనాడు నేతలు హర్షం వ్యక్తం చేశారు.