ఫిర్యాదుల వెల్లువ


` హైడ్రాలో పెండిరగ్‌లో 10వేలకు పైగా పిటిషన్లు: కమిషనర్‌ రంగనాథ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారానికి హైడ్రా చేస్తున్న కృషిని కమిషనర్‌ రంగనాథ్‌ వివరించారు. హైదరాబాద్‌: ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారానికి హైడ్రా చేస్తున్న కృషిని కమిషనర్‌ రంగనాథ్‌ వివరించారు. ఒకప్పటి చెరువుల పరిస్థితి, ఇప్పటి పట్టణీకరణ, హైడ్రా చేస్తున్న పనులపై బుధవారం ఆయన ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రజావాణికి నేరుగా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఆన్‌లైన్‌లో కూడా చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. త్వరలో హైడ్రా పోలీస్‌ స్టేషన్‌ రాబోతోందని తెలిపారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదుల పరిష్కారం కోసం కృషి చేస్తున్నా.. ఇంకా 10వేలకు పైగా పిటిషన్లు పెండిరగ్‌లో ఉన్నాయన్నారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.