అటవీశాఖ అధికారుల ఆగడాలు నియంత్రించాలి..

– ఫారెస్ట్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన కార్పెంటర్లు.
తాండూరు సెప్టెంబర్ 22(జనంసాక్షి)
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో
అటవీశాఖ అధికారుల ఆగడాలను నియంత్రిం చాలని గురువారం యూనిట్లను మూసి వేసిన కార్పెంటర్లు తాండూరు ఫారెస్ట్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుక వచ్చిన 69 జీఓ ను అడ్డుపెట్టుకుని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న పారెస్ట్ అధికారుల వత్తిడిని తగ్గించాలని కోరుతూ తాండూరు  ఫారెస్ట్  క్షేత్రస్థాయి కార్యాలయం ముందు కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు  పులేందర చారి, ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్, క్యాషియర్లు కాలప్ప,  ఇర్షద్, గౌరవ అధ్యక్షుడు పాండురంగ చారి ఇస్మాయిల్ ల ఆద్వర్యంలో
ధర్నాకు దిగిన కార్పెంటర్లు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుమతుల పేరుతో  సిఫిస్ కట్టాలంటూ  ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారుల ఆగడాలను అరికట్టాలంటూ డిమాండ్ చేశారు. నిత్యం దుకాణాల వద్దకు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అవేదనవ్యక్తంచేశారు.