అత్యవసర సేవలకు అంబులెన్సులను మూడింటిని సమకూర్చి జెండా ఉపిన మంత్రి

share on facebook


నిర్మల్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  అంబులెన్స్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సూచించారు. ‘గిప్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా సమకూర్చిన అంబులెన్స్‌ను నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్‌లు ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు. కేటీఆర్‌ పిలుపు మేరకు గిప్ట్‌ ఏ స్ల్మైల్‌ కార్యక్రమంలో భాగంగా మంత్రి  ఇంద్రకరణ్‌ రెడ్డి తన సొంత నిధులు రూ. 61.50 లక్షలతో  3 అంబులెన్స్‌లను సమకూర్చారు. ఈ వాహనాల్లో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌తోసహా అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కె.విజయలక్ష్మి రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, టీఆర్‌ఎస్‌ యువజన నాయకులు అల్లోల గౌతమ్‌
రెడ్డి, హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ దేవేందర్‌ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Other News

Comments are closed.