అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి*

కోదాడ,ఆగస్టు,29(జనంసాక్షి)
 కేసీఆర్ తమ పార్టీ అధికారం లోకి వస్తే రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయక పోవడంతో రైతులను మోసం చేసినట్లేనని సామాజిక ఉద్యమకారుడు, తెలుగు రైతు సంఘం మాజీ అధ్యక్షుడు కొల్లు వెంకటేశ్వరరావు విమర్శిoచారు.
రైతులకు రుణ మాఫీ కాక కొత్త రుణాలు ఇవ్వక పోవడంతో ప్రైవేట్ అప్పుల మీద ఆధారపడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా లక్ష రూపాయల రుణాలను మాఫీ చేసి, వెంటనే కొత్త రుణాలను మంజూరు చేయాలని కోరారు.
 ఇటీవల కురుస్తున్న తీవ్రమైన వర్షాలతో నష్టపోయిన పత్తి, మొక్కజొన్న రైతులకు ఎకరానికి 20,000/-, ఇతర పంటలకు ఎకరానికి 15,000/- రూ.ల చొప్పున సహాయం అందజేయాలని డిమాండ్ చేసారు.