అసోంలో పోటెత్తిన వరదలు.. ఆరుగురి మృతి

గౌహతి: అసోం రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరద ఉద్థృతితో 16 జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి భారీ వర్షాలతో ఇప్పటి వరకూ ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం లోతట్టు ప్రాంతాల్లోని వేలాది మంది పునరావాస శిబిరాలకు తరలివెళ్తున్నారు. కజిరంగా జాతీయ పార్క్‌తో సహా మూడు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు నీట మునిగాయి. సహాయక చర్యల్లో సైన్యం, వాయుసేవ సిబ్బంది పాల్గొంటున్నారు.