ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ .మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

share on facebook

 నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్26,జనంసాక్షి,,,  మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి  వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వకారణమని చెప్పారు. సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట  ఆమె విగ్రహానికి  పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా  నిర్వహిస్తున్నామని చెప్పారు.
నిర్మల్ పట్టణంలో కలెక్టర్ కార్యాలయం ఎదురుగా  ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని  ఏర్పాటు కోసం ఇటీవలే భూమి పూజ చేశామన్నారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తీ చేసుకుని , విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని అన్నారు, ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కమీషనర్ సంపత్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.