ఉధృతమవుతున్న బీసీ ఉద్యమపోరు
` బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం
` బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు సహకరించాలి
` పిలుపునిచ్చిన ఆర్.కృష్ణయ్య
` బీసీ ఐకాస ధర్నాకు బీఆర్‌ఎస్ మద్దతు
` కాంగ్రెస్ ప్రయత్నంతో రిజర్వేషన్లు రావు
` పార్లమెంటులో బిల్లు పెడితేనే సాధ్యం
` బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోనే ఇది సాకారం: కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి):బీసీ రిజర్వేషన్ల కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని ఆర్.కృష్ణయ్య తెలిపారు. ప్రజా ఉద్యమాలు బలంగా జరిగితేనే ప్రభుత్వాలు, పార్టీలు స్పందిస్తాయన్నారు. ‘‘ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం దశాబ్దాలు నడిచింది. అన్నాదమ్ముల మధ్య వాటాలు ఎప్పటికైనా పంచాల్సిందే. బీసీలకు రిజర్వే షన్లు పెంచడం ఎప్పటికైనా తప్పదు. ప్రజల మధ్య విభేదాలు పెరగకముందే సామరస్యంగా పరిష్కరించాలి. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు సహకరించాలి’’ అని పిలుపునిచ్చారు.బీసీ ఐకాస ధర్నాకు భారత రాష్ట్ర సమితి నైతిక మద్దతు ఉంటుందని కేటీఆర్ తెలిపారు. బీసీ-ఐకాస ఆధ్వర్యంలో ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరిట ఈనెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆర్.కృష్ణయ్య, కమిటీ ప్రతినిధులు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు.బీసీ ఐకాస ధర్నాకు భారత రాష్ట్ర సమితి నైతిక మద్దతు ఉంటుందని కేటీఆర్ తెలిపారు. బీసీ`ఐకాస ఆధ్వర్యంలో ’బంద్ ఫర్ జస్టిస్’ పేరిట ఈనెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆర్.కృష్ణయ్య, కమిటీ ప్రతినిధులు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు బీసీల కోసం కేసీఆర్ ఎన్నో చేశారు. బీసీలకు లాభం జరగాలంటే పార్లమెంటులో బిల్లు చేయాలి. అసెంబ్లీలో చేసి నెపాన్ని ఇతరులపై నెట్టడం సమంజసం కాదు. బీసీల విషయంలో కాంగ్రెస్‌ది చిత్తశుద్ధి లేని శివపూజ. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే సరిపోతాయా? రాజకీయ రిజర్వేషన్లతోపాటు అన్ని రకాలుగా మేలు జరగాలి. ధర్నాకు మద్దతు ఇస్తామంటున్న భాజపానే బిల్లు పెడితే అయిపోతుంది కదా అని వ్యాఖ్యానించారు.తెలంగాణ ఉద్యమం మాదిరే, సమస్యను ఢల్లీి దాకా తీసుకువెళ్లి తెలంగాణ సాధించుకున్నట్లుగానే బీసీ రిజర్వేషన్లను సాధించుకుందాం. 18వ తేదీన బీసీ సంఘాలు నిర్వహించే బంద్‌కు మా పార్టీ మద్దతు ఇస్తుంది అని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రయత్నం మంచిది కాదు అని కేటీఆర్ హితవు పలికారు. పూటకో మాటతో బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. 2004లో ఆర్ కృష్ణయ్యను తీసుకొని ప్రధానమంత్రి దగ్గరకి వెళ్లి కేసీఆర్ మూడు విషయాలు చెప్పారు. ఒకటి దేశంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి, రెండు జనాభాకి అనుగుణంగా రాష్టాల్రకు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలి, మూడు చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కావాలని కేసీఆర్ అడిగారు. భారత దేశ స్థాయిలో ఈ మూడు అంశాల విూద మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లపైన మా పార్టీ విధానాన్ని చాలా స్పష్టంగా మా పార్టీ చెప్పింది. గతంలో శాసనసభలో రెండుసార్లు రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి పంపించింది. కానీ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రచారం చేసుకోలేదు. కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా రిజర్వేషన్లు పెడతామని శాసనసభలో చెప్పినప్పుడు మేము ఆ పార్టీ తరఫున మద్దతు ఇచ్చాము. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పైన ఐదు రకాలుగా మాట్లాడుతోంది. రాజ్యాంగ సవరణ ద్వారా, పార్టీ తరఫున రిజర్వేషన్లు ఇస్తామని, ఆర్డినెన్స్ ద్వారా, బిల్లు ద్వారా, మరోసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే బీసీ రిజర్వేషన్లు వస్తాయని చెప్పారు. ఇన్ని రకాలుగా మాటలు మార్చిన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని మేము తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు, ఆయన నాయకత్వంలో రానే రావు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి బలహీన వర్గాలకు ఇచ్చిన ప్రతి హావిూని నెరవేర్చేదాకా నిలదీస్తూనే ఉంటాము. బీసీ డిక్లరేషన్లు ఇస్తామని చెప్పిన లక్ష కోట్ల బ్జడెట్ నుంచి మొదలుకొని బీసీ సబ్‌ఎª`లాన్ వంటి హావిూలపైన నిలదీస్తూనే ఉంటాము. కాంగ్రెస్ తెచ్చిన 42 శాతం రిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థల కోసం తీసుకువచ్చారు కానీ, విద్య, ఉపాధికి సంబంధించిన రిజర్వేషన్ల వాటా మిగిలిన అన్ని రంగాల్లో రావాల్సిన అవసరం ఉన్నది. కాంట్రాక్టులనుంచి మొదలుకొని అన్నింటికి సంబంధించిన వాటిలో 42 శాతం వాటా రావాలి అని బీసీ సమాజం డిమాండ్ చేయాలి అని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నటువంటి కార్యక్రమాల అమలుపైన మనం నిలదీయాల్సిన అవసరం ఉన్నది. బీసీ సంఘాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హావిూలన్నిటి పైన నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. విద్య, ఉపాధి వంటి 42 శాతం రిజర్వేషన్ అన్ని రంగాల్లో గనక ఇస్తే లక్షల మంది బీసీ బిడ్డలకు లాభం జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ల అంశంలో చిత్తశుద్ధి లేని శివపూజలాంటివి. రేవంత్ రెడ్డికి బీసీల అంశంలో ఎలాంటి చిత్తశుద్ధి లేదు. రాహుల్ గాంధీ, మోడీ ఇద్దరూ కలిసి ఒక్క మాట అంటే ఒక్క నిమిషంలో బీసీ రిజర్వేషన్ల అంశం తేలిపోతుంది. ఇండియా, ఎన్డీఏ రెండు కూటములు కలిస్తే బీసీ రిజర్వేషన్ బిల్లు వెంటనే చట్టంగా మారుతుందన్నారు. పార్లమెంటులో బిల్లు పెడితే కచ్చితంగా బీసీ రిజర్వేషన్ల కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని ఆర్.కృష్ణయ్య తెలిపారు. ప్రజా ఉద్యమాలు బలంగా జరిగితేనే ప్రభుత్వాలు, పార్టీలు స్పందిస్తాయన్నారు. ‘ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం దశాబ్దాలు నడిచింది. అన్నాదమ్ముల మధ్య వాటాలు ఎప్పటికైనా పంచాల్సిందే. బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ఎప్పటికైనా తప్పదు. ప్రజల మధ్య విభేదాలు పెరగకముందే సామరస్యంగా పరిష్కరించాలి. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు సహకరించాలి‘ అని పిలుపునిచ్చారు.
హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టులో నేడే విచారణ
` బీసీలకు 42% రిజర్వేషన్‌లపై తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌ను విచారించనున్న అత్యున్నత ధర్మాసనం
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌ల జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రిజర్వేషన్ల అమలు జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సవాల్ చేసింది. దీనిపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారించనుంది. పిటిషన్ విచారణకు స్వీకరించాలో? లేదో? ఖరారు చేయనుంది.హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని వాదించనుంది. సుప్రీం కోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి, బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్‌లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్‌ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లనుంది.