ఆర్టీసీ ఛార్జీలపై రాష్ట్ర తెలుగు యువత వినూత రీతిలో నిరసన వ్యక్తం
హైదరాబాద్: పెంచిన ఆర్టీసీ ఛార్జీలపై రాష్ట్ర తెలుగు యువత వినూత రీతిలో నిరసన వ్యక్తం చేసింది. చలనం లేని ముఖ్యమంత్రి, మంత్రుల కన్నా నోరు లేని జీవాలు మిన్న అంటూ దున్నపోతుకు వినతి సమర్పించారు. సామాన్య ప్రజానీకంపై ఆర్టీసీ ఛార్జీల పెంపు మోయలేని భారంగా పరిణమించిందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్రయాదవ్ అన్నారు.