ఆర్యవైశ్యుల అభివృద్దికి ప్రభుత్వం కృషి


భవన నిర్మాణం కోసం రూ. కోటి మంజూరు
జమ్మికుంట,అగస్టు11(జనం సాక్షి): ప్రభుత్వం ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఆర్యవైశ్యుల ఏండ్ల నాటి కల నెరవేరింది. జమ్మికుంట ఆర్యవైశ్యుల కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర పోలీస్‌ హౌజింగ్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ చేతుల విూదుగా శంకుస్థాపన చేశారు. ఈ భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం ఎకరం భూమి, రూ. కోటి ఇప్పటికే మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి కమ్యూనిటీ భవనం కోసం నాటి నాయకుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని గుర్తు చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఆర్యవైశ్యులకు కమ్యూనిటీ భవనం నిర్మాణానికి భూమి, నిధులు అందించామని చెప్పారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్యుల కోసం కమ్యూనిటీ భవనం కావాలని సీఎం కేసీఆర్‌ను అడిగిన వెంటనే.. మంజూరు చేశారని రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ఆర్యవైశ్యులు రుణపడి ఉంటారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యుల తరపున కేసీఆర్‌కు దామోదర్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం
ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌ రావు, కమిషనర్‌ సుమన్‌ రావు, ఏఈ చంద్రకళ, రైస్‌ మిల్లర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు పాపయ్య, ఆవోపా నాయకులు డాక్టర్‌ రాజేశ్వరయ్య, రాజేందప్రసాద్‌, నర్సయ్య, రవీందర్‌, సమ్మయ్య, శ్రీనివాస్‌, తిరపతయ్య, శివశంకర్‌, శంకరయ్య, శరత్‌, తదితరులు పాల్గొన్నారు.