ఆలయఅభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి : కర్మన్ ఘాట్ట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయ ఈవో శ్రీనివాస శర్మ
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆలయ ఈవో శ్రీనివాస శర్మ పిలుపునిచ్చారు . బుధవారం ఆలయంలో దాతల సహకారం తో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు – శ్రీ స్వామి వారి మూల విరాటు వెండి కవచము ఏర్పాటు, శ్రీ వేణుగోపాల స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట, నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట, శ్రీ సరస్వతి ఆలయ మండప విస్తరణ, క్యూ లైన్ల ఏర్పాటు, శ్రీ విశ్వనాథ ఆలయం ఎదురుగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ మండపములో గ్రానైట్ ఫ్లోరింగ్ వేయుటకు సహకరించిన దాతలను ఆలయమునకు ఆహ్వానించి వారి పేరున శ్రీ స్వామి వారి సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి దాతలు అందరిని సముచిత రీతిలో సత్కరించి వారికి స్వామివారి ప్రసాదములు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాస్ శర్మ, ఆలయ చైర్మన్ పి ఈశ్వరమ్మ యాదవ్ ధర్మకర్తలు యాది రెడ్డి, , సిరిపురం రాజు, అనిత, ఇమిడి జంగయ్య భక్తులు మధు సాగర్ తదితరులు హాజరయ్యారు.