ఆసరా పింఛన్ కార్డులను అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ ఆగస్టు 29 (జనంసాక్షి) జహీరాబాద్ మండలం హోతి (బి) గ్రామంలో జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు 20 లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 57 సంవత్సరాలు నిండిన అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్ ద్రువపత్రాలను అందజేశారు.కార్యక్రమాల్లో ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు, మాజీ జెడ్పీటీసీ మనేమ్మ, సర్పంచు పర్వేజ్, ఉప సర్పంచుల ఫోరమ్ అద్యక్షులు నారాయణ, ఎస్టీ సెల్ మండల అద్యక్షులు హిరు రాథోడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ అద్యక్షులు తాజుద్దీన్, నాయకులు మచ్చేందర్, పర్వేజ్, వహీద్, మోహన్ రెడ్డి, ఇజ్రాయేల్ బాబీ, అహ్మద్ అలి, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.