ఇది ప్రజాస్వామ్యమేనా ?

మూడు వారాలుగా లక్షలాది మంది తెలంగా ణ పౌరులు, భిన్న రంగాలకు చెందినవాళ్లు – వి ద్యార్థులు, ఉపాధ్మాయులు, కార్మికులు, ప్రభుత్వో ద్యోగులు, రైతులు, గ్రామీణ ప్రాంత పేదలు, కాం ట్రాక్టు ఉద్యోగులు-నిజానికి సమస్త రంగాల నుం చి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాజీ లే కుండా పోరాడుతున్నారు. దేశలో రెండు మూడు దశాబ్దాలుగా ప్రయోగించిన శాంతియుత పద్ధతుల న్నింటిని ఉపయోగిస్తున్నారు. నాకు తెలిసి దేశం లో ఇంత శాంతియుత పోరాటాలు చాలా అరుదు గా జరిగాయి. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యా లయ విద్యార్ధులతో పాటు తెలంగాణలోని అన్ని వి శ్వవిద్యాలయాల కాలేజీ విద్యార్థులు పాటించిన అ సాధారణ సంయమన, పరిణతి నమ్మశక్యంకాని స్థాయిలో ఉన్నాయి, దీనికి రాజకీయనాయకులకు, ఉదయమకారులకు, ఉద్యమ నాయకులకు అభి నందనలు చెప్పవలసిందే.

ఇంత శాంతియుత ఉధృత ఉద్యమానికి ఏ స్థాయిలో కూడా స్పందిచని రెండు ప్రధాన రాజకీ య పార్టీలను, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని, అ న్నిటికి మించి బాధ్యతారహితమైన కేంద్ర ప్రభు త్వాన్ని ఏమనాలో, ఎలా అర్థం చేసుకోవాలో, ఏం అంచనా వేయలో అర్థం కావడం లేదు. ఈ మొ త్తం ప్రక్రియను చూస్తుంటే.. ఇప్పుడు మనం పాల కులు చెప్పే అతిపెద్ద ఉదార ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామా? లేక ఒక ‘ప్రజాస్వామిక భ్రాంతి’ లో బతుకుతున్నామా?అనే ఒక మౌలిక ప్రశ్న అడ గవలసిన సమయం,సందర్భం ఇది.

మావోయిస్టు ఉద్యమం గురించి మాట్లాడు తూ గత వారం కేంద్ర హోం మంత్రి చిదంబరం ‘మీరు మీ ఆయుధాలను,మీ సిద్ధాంతాలను వదల వలసిన అవసరం లేదు.కేవలం హింసను ఆపండి’ అని వాళ్ల పోరాటం ప్రారంభమైన నాటి నుంచి నాలుగు దశాబ్దాలుగా చెపుతూనే ఉన్నారు.హింస ప్రతి హింస వలయాన్ని దాటి అసలు ఈ హింసకు మూల కారణాలు సామాజిక కార్థిక నిర్మాణంలో ఎక్కడ ఉన్నాయో వెతకవసిన అవసరం చరిత్రకు ఉంటుంది.చిదంబరం లాంటి వ్యక్తులకు,ఫిలాసఫి చదవకపోవడం వలస చారిపూతక స్పృహలేకపోవ డం వల్ల సందర్భంతో సంబంధం లేకుండా మా ట్లాడుతుంటారు.అంతేకాక ఉద్యమకారులు ప్రధా న జన పోటీచేసి రాజ్యాధికారంలోకి రావచ్చు గదా అని హూం మినిస్టర్‌నే కాదు చాలా మంది మధ్య తరగతి విద్యావంతులు, మేధావులు మాట్లాడుతుం టారు. ఈ వాదనలను ఇప్పుడు తెలంగాణలో జ రుగుతున్న ఉద్యమ అనుభవం నుంచి పరీక్షించవ లసిన అవసరముంది.

చిదంబరం గారు 2009 డిసెంబర్‌ 9న తె లంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల సమావే శం తర్వాత, దాదాపు అన్ని పార్టీలు తెలంగాణ రా ష్ట్రానికి మద్దతు తెలిపిన తర్వాత, అసెంబ్లీలో తీర్మా నం పెట్టండి మేం మద్దతు ఇస్తాం అని చంద్రబా బు స్వయంగా ప్రకటించిన తర్వాత ఈ ప్రకటన చేశారు. బహుశా ప్రజాస్వామ్య వ్యవస్థలో 9 డి సెంబర్‌ ప్రకటన ఒక శాంతియుత ఉద్యమ విజ యంగా భావించిన తరుణంలో రాజకీయ పార్టీలు ప్లేటు ఫిరాయించాయి. దీంట్లో కాంగ్రెస్‌ పార్టీని ప్రధానగా తప్పుపట్టాలి. కేంద్రంలో అధికారంలో ఉండి ప్రభుత్వం తరపున తమ హూం మంత్రి ప్ర కటన చేసే దాకా ఆగి మరునాడే’మా ప్రాంత నేతల ఆకాంక్ష మేం సరిగా అంచనా వేయలేకపో యాం’ అని రాత్రికి రాత్రే జ్ఞానోదయం అయినట్టు మాట్లాడిన ఆంధ్ర ప్రాంత నేతలను ప్రజాప్రతినిధు లు అని మనం పరిగిణించవచ్చా?అలాగే మరో ప్రాంతం నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి తాను చే సిన ప్రకటనను పున:పరిశీలించవలసి వచ్చింది అ ని మాట మార్చిన చిదంబరంను కానీ, కేంద్ర ప్ర భుత్వాన్ని కానీ మనం ఎలా అర్థం చేసుకోవాలి.

సమస్య జటిలం అయిందని ఒక న్యాయమూ ర్తితో కమిటీ వేస్తే, ఒక అవాస్తవ,అసందర్భ, అస్ప ష్ట రిపోర్టు ఇచ్చిన వారి గురించి మనం ఏం అనుకోవాలి ? చిదంబరం, కేంద్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, కమిటీలు,కమిషన్‌లు ఒక ప్ర జాస్వామ్య వ్యవస్థలో ఉత్పన్నమైన ఒక సమస్యకు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కా రం కనుక్కునే బదులు వాళ్లే సమస్యలో భాగమైతే సమస్యలకు పరిష్కారం ఎక్కిడి నుంచి వస్తుంది.

వ్యవస్థలు, సంస్థలు, వ్యక్తులు తమ పాత్ర తా ము నిర్వాహించనప్పుడు ఆ మొత్తం వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం పోతుంది. విశ్వసనీయత కో ల్పోయిన రాజకీయ వ్యవస్థ చట్టబద్ధమైన అధికారా న్ని చలాయించే నైతిక అర్హతను కోల్పోతుంది. అ లా కోల్పోయినందువలే ప్రజలు ప్రత్యక్ష చర్యలకు పూనుకుంటారు. అన్ని సామాజిక, రాజకీయ ఉద్య మాలకు మూలం ఇదే. మావోయిస్టు పార్టీ లేదా ఇతర విప్లవ ఉద్యమాలు’ ఇప్పుడున్న వ్యవస్థకు శస్త్ర చికిత్స చేయవలసిందే’ అని అంటున్నాయి. అలాకాదు వ్యవస్థలో పరిష్కారమార్గాలు లేవు కను క మొత్తం వ్యవస్థకు శస్త్ర చికిత్స చేయవలసిందే’ అని అంటున్నాయి. అలాకాదు వ్యవస్థలో పరిష్కా రాలు అభిస్తాయి అని అన్ని పార్లమెంటరీ రాజకీ య పార్టీలు వాదిస్తున్నాయి. మరి ఇలాంటప్పుడు తెలంగాణ సమస్యను ఎందుకు పరిష్కారించలేక పోతున్నారో వివరించవలసిన బాధ్యత ఆయా రాజ కీయ పార్టీల మీద ఉంది.

రాజకీయ పార్టీలు తెలంగాణ సమస్యను పరి ష్కరించలేకపోవడం, ప్రజా ఉద్యమాలను, ఆకాంక్ష లను గుర్తించలేకపోవడం ఎంత పెద్ద ప్రజాస్వామ్య విషాదమో ఊహిస్తేనే అందోళన కలుగుతుంది. ప్రత్యేక రాష్ట్ర అకాంక్ష ఇప్పుడు వచ్చింది కాదు. దీ నికి దశాబ్దాల చరిత్ర ఉంది. తెలంగాణ ఉద్యమా నికి ప్రతిగా ఆంధ్రలో సమైక్య ఉద్యమం ప్రారం భించారు. సమైక్య ఉద్యమానికి మొదటి నాయకు డు ఒక కంపెనీలు పెట్టుకొని కోట్లాది రూపాయ లు కొల్లగొడుతున్న వారు ప్రజాప్రతినిధులుగా ఎ లా రూపాంతరం చెందుతారన్నది కూడా ప్రజాస్వా మ్యానికి ప్రశ్నే. తమ ప్రయోజనాలు, లాభాల వేట లో ఉండేవారు తమ స్వప్రయోజనాన్ని, ప్రయోజ నాన్ని కలిసి సమష్టి పేరుతో లాభాలు చేసు కునే వారు ప్రజాస్వామ్య సంస్కృతికి దోహదం చేయగల రా! అనే ఒక సవాలు సమాజం ఎదుర్కొంటున్నది.

కంపెనీ యజమానులు హైదరాబాద్‌ నగరం లో విపరీతంగా పెట్టుబడులు పెట్టారు. కోటాను కోట్లు లాభాలు గడించారు. అలాంటి వాళ్లు తప్పక తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని గు రించి ఆలోచిస్తారు. సానుభూతితో పరిష్కరించాల ని ఒత్తిడి పెడతారు. తమ ప్రయోజనాలు కొన్ని వదులుకోవడానికి సిద్దంగా ఉంటారు. కాని కంపె నీ యజమానులు  తెలుగు ప్రజల సమైక్యత గురిం చి మాట్లాడితే వాళ్ల అభిప్రాయాలను ప్రజాభిప్రా యం అని అనుకునే అమాయకపు స్థితిలో ప్రజలు లేకపోవడం యజమానుల’ దురదృష్టం’.

తెలంగాణ ఉద్యమం కేసీఆర్‌ కుటుంబం న డుపుతున్నదనో, కొందరు రాజకీయ నిరుద్యోగుల వ్యూహమనో అంటున్న వాళ్లు లక్షలాది సంఖ్యలో కదులుతున్న జనాన్ని చూసైనా అలా వాదించడం మానుకోవాలి. ఉద్యమాలు ప్రారంభించిన వాళ్లకు తమ రాజకీయ కారణాలుండొచ్చు. ఇప్పుడు తెలం గాణ ఉద్యమం ఆ స్థాయి దాటిపోయింది. ఇది ప్ర జా ఉద్యమమని గుర్తించడం మొదట చేయవలసి న పని. ఇంత విస్తృత స్థాయి లో ప్రజలు కదిలిన ప్పుడు ప్రజలే ప్రత్యక్ష చర్యకు పూనుకున్నప్పుడు దాన్ని గౌరవించే సంస్కృతి లేక పోతే ఆ వ్యవస్థకు భవిష్యత్తు ఉంటుందని విశ్వసించలేము.

ఈ ఉద్యమాన్ని అణచివేయగలమని పాలకు లు భావిస్లున్నట్లున్నారు. విచ్చలవిడిగా ప్రవర్తించే పోలీసులను మనం నాలుగు దశాబ్దాలుగా ఉద్య మాల అణచివేత పేర తయారు చేసుకొని ఉన్నాం. ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి కేంద్ర ప్ర భుత్వం పోలీస్‌ శాఖకు లెక్కలేనన్ని విధులు సమ కూర్చింది. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ బ లగాల మీద ఆధారపడి ఉండడమే, ఇది ప్రజాస్వా మ్య వ్యవస్థ కాదనడానికి సాక్ష్యం. ఇది ప్రజాపాల న కాదని అతి సామాన్యుడికి అర్థమైపోయింది. ప్ర జల బాగు కొరకు, సమాజ మార్పు కొరకు, భార త రాజ్యాంగం వాగ్దానం చేసిన సమసమాజ నిర్మా ణం కోసం పోరాడుతున్న ప్రజలపై ఇంత బల ప్రయోగం అవసరం ఏమిటో ఏలిన వారే చెప్పాలి.

శాంతియుత తెలంగాణ భగ్గుమంటే ఎవరు బాధ్యులు? ఇంత శాంతియుత ఉద్యమానికి స్పం దించని పాలకులు ప్రజలకు ఏం సందేశామిస్తు న్నారో ఆలోచించాలి. ప్రజలు చరిత్ర నిర్మాతలు, తెలంగాణ చరిత్రను ఇలా మార్చుకోలేకపోతే ఎలా మార్చుకోవాలో వాళ్లే నిర్ణయించుకుంటారు. ఇక తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యంలో శాంతియు త పద్ధతుల ద్వారా సమస్యలలను పరిష్కరించుకో వచ్చు అని మళ్లీ మాట్లాడే చారిత్రక అవకాశం మి గలదని పాలకులు అర్థం చేసుకోవాలి.

– తిరుపతి