ఇన్‌ స్పెక్టర్‌ వేదింపులు

చైతన్యపురి : ఇన్‌స్పెక్టర్‌ శివన్నాయుడు సివిల్‌ కేసుల్లో ఇరికించి తమను వేదిస్తున్నాడంటూ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన దుగ్గు గౌరమ్మ పోలీసుఉన్నతాదికారులకు, హోంమంత్రికి ఫిర్యాదు చేశాడు. తమ ఇంటికి సమీపంలో అక్రమ నిర్మాణం చేస్తున్కన వ్యక్తులపై తాను తన కోడుకులు మున్సిపల్‌ అదికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా, అదే కేసులో ఇన్‌స్పెక్టర్‌ తలదూర్చి తమపై అక్రమ కేసులు బనాయిస్తానంటూ బెదిరిస్తున్నాడని అవేదనవ్యక్తం చేశారు. ఈ విషయంలో ఉన్నతాదికారులు కల్పించుకోని ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.