ఇరువర్గాల మధ్య ఘర్షణ: 14మందికి తీవ్రగాయాలు

ఇటిక్యాల: ఇటిక్యాల మండల శివారు బుడ్డారెడ్డిపల్లి గ్రామంలో భూ తగాదాలతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు వేట కొడవళ్లతో దాడి చేసుకన్నారు. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన 14మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని గద్వాల ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో అల్లర్లు జరగకుండా పోలీసులు పికెట్‌ నిర్వహిస్తున్నారు. 144సెక్షన్‌ అమలు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.