ఇళ్లస్థలాలు కోరుతూ ధర్నా

స్టేషన్‌ఘన్‌పూర్‌ : స్థానిక తహసిల్దారు కార్యాలయం ఎదుట సీపీఎం అధ్వర్యంలో ధర్నా జరిగింది. పదిహేనేళ్ల కిందట ప్రభుత్వం సర్వే నెంబరు 763 లో నిరుపేదలకు ఇళ్లస్థలాల పట్టాలు ఇచ్చి నేటి వరకు స్థలాలు చూపెట్టలేదని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని సీపీఎం నాయకులు అరోపించారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని పార్టీ మండల కార్యదర్శి తోట రమేష్‌ డిమాండ్‌ చేశారు.