ఉన్న చోటు నుంచే వైద్యం

C

– పేదలకు  అధునాతన వైద్య సౌకర్యం

– జడ్చర్లలో ఈ – హెల్స్‌ సెంటర్‌   ప్రారంభించిన కేటీఆర్‌

మహబూబ్‌నగర్‌,జులై7(జనంసాక్షి):  జడ్చర్లలో ఈ-హెల్త్‌ సెంటర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా జడ్చర్లలో ఈ-హెల్త్‌ సెంటర్‌ ప్రారంభించారు.  జడ్చర్ల కమ్యూనిటీ ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా ఈసేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకే ఈ-హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో లివర్‌ మార్పిడికి రూ.45 లక్షల వరకు ఖర్చవుతుంది. ఉస్మానియా ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా లివర్‌ మార్పిడి జరుగుతుందని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడమే ఈ-హెల్త్‌ సెంటర్‌ లక్ష్యమని మంత్రి ప్రకటించారు. తెలంగాణలో పేదలు ఇకపై వైద్యం కోసం బాధపడాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచయినా సేవలు పొందేలా ఈ ఆరోగ్య సర్వీసు పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఆస్పత్రికి వెళ్లిన ప్రతిసారి పరీక్షలు చేయించుకోనక్కర్లేదన్నారు. కాలేయం, గుండెవ్యాధులు, పెద్ద చికిత్సలు దీని ద్వారా సులభతరం అవుతాయన్నారు. ఆస్పత్రులను తనిఖీ చేసి నేరుగా పర్యవేక్షిచేందుకే కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా జడ్చర్లలో ఈ-హెల్త్‌ సెంటర్‌ ప్రారంభించారు.మెరుగైన వైద్యం కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడమే ఈ-హెల్త్‌ సెంటర్‌ లక్ష్యమని మంత్రి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ‘ఈ-హెల్త్‌’ సేవలను విస్తరిస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మైరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో వైద్యనిపుణుల సలహాతో రోగులకు చికిత్సలు అందేలా ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని సంపుటీకరించనున్నట్లు తెలిపారు. రాబోయే నాలుగేండ్లలో వైద్యఆరోగ్య శాఖలను మరింతగా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో వైద్యశాఖామంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ‘ఈ-హెల్త్‌’ సేవల గదికి, జడ్చర్ల 100పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు.  మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పతుల్లో ఇప్పటికీ ఐసీయూలు లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. భవిష్యత్‌లో అన్ని జిల్లా ఆస్పత్రుల్లోనూ ఐసీయూలు ఏర్పాటు చేస్తామన్నారు. వైద్యరంగాన్ని పటిష్టం చేసిఆస్పత్రలను బలోపేతం చేస్తామన్నారు.  కార్యక్రమంలో మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, పార్లమెంట్‌ సభ్యుడు జితేందర్‌రెడ్డి, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ భాస్కర్‌, ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు పాల్గొన్నారు.