నకిలీ పత్రాలతో భూ కబ్జాకు తెరలేపిన ముఠా అరెస్ట్…
* తన భూమిని అక్రమిస్తున్నారని పోలీసులకు బాధితుని ఫిర్యాదు.
• తప్పుడు పత్రాలు సృష్టించడంతో 8 మందిపై కేసు నమోదు.
• A4 కొండూరి శ్రీనివాస్ తో పాటు A7 వర్శిత్ కుమార్(బంటి), A8 జగదీష్ ఠాకూర్(జగ్గు) అరెస్ట్.
• పోలీసులు కోర్టులో హాజరు పరుచగా 14 రోజుల రిమాండ్.
* పరారీలో A2 దుడ్డేల శ్రీధర్ తో పాటు మరో నలుగురు.
* కరీంనగర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం.
కరీంనగర్ పట్టణానికి చెందిన భూ బాధితుడు బచ్చు రాజు S/o సోమలింగం, వయస్సు: 55 సంవత్సరాలు, కులం: వైశ్య, Occ: వ్యాపారం r/o H.No:1-1-113/1/A, లక్ష్మీనగర్, కరీంనగర్ నివాసి మీడియాతో మాట్లాడుతూ పట్టణ సర్వే.నెం.449 లో తేదీ:14-09-2009 రోజున గుడిశె మల్లీశ్వరి W/o సత్యనారాయణ మరియు గుడిశె విజయలక్ష్మి W/o విరేశం, వీరిద్దరి నివాసం కరీంనగర్ వీరి వద్ద నుండి DOC.NO. 6053/2009 ద్వారా సర్వే నెం.449 లో ప్లాట్ నెం.5 విస్తీర్ణం.299.98 చ||గజాల ఖాళీ స్థలంను ఇతను GPA ద్వారా కొనుగోలు చేసినాడని అట్టి ఖాళీస్థలాన్ని సిమెంటు ఇటుకలతో ప్రహరీ గోడను నిర్మించి గేటు పెట్టి వినాయక ఇంజనీరింగ్ షాప్ యజమాని అయిన బైరి మల్లెశం గారికి ప్లాస్టిక్ పైపుల గోదాం కొరకు కిరాయకి ఇచ్చినాడని అట్టి భూమికి ఇతను LRS కూడా కట్టుకున్నాడని తెలిపాడు. అతని ఖాళీ భూమిని కాజేయలనే దుర్భుద్ధితో పథకం ప్రకారం కుట్ర పన్ని 1) నూగూరి శారద అలియాస్ తుమ్మల శోభ W/o. రాంరెడ్డి R/o. సంతోష్ నగర్ కరీంనగర్ తో కలిసి 2)దుద్దేల శ్రీధర్ S/o. వెంకట స్వామి, R/o: ధోబివాడ కరీంనగర్, 3)కొండూరి పద్మ W/o. శ్రీనివాస్ R/o. గణేష్ నగర్ కరీంనగర్, మరియు ఆమె భర్త అయిన 4)కొండూరి శ్రీనివాస్ తో పాటు మరి కొందరు ఇట్టి భూమిని కాజేయాలనే దురుద్దేశంతో తేది:12-08-2014 రోజున DOC.NO.135/2014 ద్వారా సర్వే నెం.448 లో విస్తీర్ణం:0-35 గుంటలు, సర్వే నెం.449 లో విస్తీర్ణం:01-14 ఎకరాలు, సర్వే నెం.839 లో విస్తీర్ణం:05-23 ఎకరాలు, ఇలా మొత్తం విస్తీర్ణం:07-32 ఎకరాల భూమిని కరీంనగర్ కలెక్టర్ జారీ చేసినటువంటి ప్రొసీడింగ్ కాపీ HC.NO.A5/8356/93 ని డాక్యుమెంట్ లో చూయిస్తూ ఇట్టి ప్రొసీడింగ్ కాపీ ద్వారా నూగూరి శారద కరీంనగర్ సివిల్ కోర్టుకు వెళ్లగా కేసు డిస్మిస్ అయ్యిందనే విషయాన్ని దాచిపెట్టి రిజిష్టేషన్ అధికారులను తప్పుడు తొవ్వ పట్టిస్తూ ఒకసారి నూగూరి రాజేశ్వర్ రావు మరియు నుగూరి శారద అమ్మివేసిన భూమిని మళ్ళీ నూగూరి శారద నుండి దుద్దేళ్ల శ్రీధర్ S/o.వెంకట స్వామి పేరిట దొంగతనంగా డబుల్ రిజిష్టేషన్ GPA చేసుకుంటారు. ఆ తర్వాత తేది:07/03/2015 రోజున DOC.NO.2485/2015 ద్వారా సర్వే నెం.లు 448 మరియు 449 అని నమోదు చేస్తూ విస్తీర్ణం:181.50 చ||గజాల భూమిని GPA హోల్డర్ దుడ్డేల శ్రీధర్ S/o.వెంకటస్వామి పేరిట నుండి కొండూరి పద్మ W/o.శ్రీనివాస్ పేరిట విక్రయ దస్తావేజు చేసుకుంటారు. తేది:19-06-2025 రోజున పొద్దున అందదా 10.30 గంటల సమయంలో నా భూమి లోకి (1) కొండూరి శ్రీనివాస్, (2) కొండూరి వేణు, (3) కొండూరి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకన్న, (4) మాడ క వర్శిత్ కుమార్ అలియాస్ బంటి R/o.లక్ష్మీ నగర్ కరీంనగర్, (5) జగదీష్ ఠాకూర్ అలియాస్ జగ్గు R/o. కరీంనగర్, మరికొంతమంది నా భూమిలో పోళ్లు పాతుతుండగా ఎందుకు అని అడిగితే పై వ్యక్తులు గడ్డపారలు, ఇనుప రాడ్ లు తీసుకొచ్చి నన్ను చంపుతానని బెదిరించినందున నేను అక్కడి నుండి భయపడి పరిపోయాను. ఈ భూమిలోకి మాల్లోక్కసారి నువ్వు వస్తే నిన్ను చంపి ఇక్కడే పాతి పెడతామని నన్ను బెదిరించి నానా భూతులు తిడుతూ భయబ్రాంతులకు గురిచేశారు. చేసేదేమీ లేక స్థానిక వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినాను. వెంటనే స్పందించిన పోలీసులు నాకు న్యాయం చేసారని తెలుపుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
పోలీసుల టిలిపిన వివరాలు….
పోలీస్ స్టేషన్ నందు తనకు జరిగిన అన్యాయం పై ఫిర్యాదు చేయడంతో కేసు 437/2025 నమోదు చేసి విచారణ జరుపగా బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం పై వారు నకిలీ పత్రాలను నిజమైనవిగా చూపించి దస్తవేజులు తయారుచేసి భూ కబ్జాకు ప్రయత్నించింది గాక బెదిరింపులకు గురిచేసారని విచారణలో తేలింది.
పై అక్రమ చర్యలకు పాల్పడినందుకు గాను ఎనిమిది మందిపై
(A1) నూగూరి శారద అలియాస్ తుమ్మల శోభ W/o. రాంరెడ్డి R/o. సంతోష్ నగర్ కరీంనగర్.
(A2)దుద్దేల శ్రీధర్ S/o. వెంకట స్వామి, R/o: ధోబివాడ కరీంనగర్.
(A3)కొండూరి పద్మ, (A4) కొండూరి శ్రీనివాస్,
(A5) కొండూరి వేణు,
(A6) కొండూరి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకన్న,
(A7) మాడ క వర్శిత్ కుమార్ అలియాస్ బంటి R/o.లక్ష్మీ నగర్ కరీంనగర్,
(A8) జగదీష్ ఠాకూర్ అలియాస్ జగ్గు లపై 61, 338, 318(4), 336(3), 340, 329(3), 351(2), r/w 3(5) BNSల ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా (A4) కొండూరి శ్రీనివాస్, (A7) మాడక వర్శిత్ కుమార్ అలియాస్ బంటి మరియు (A8) జగదీష్ ఠాకూర్ అలియాస్ జగ్గు ని మంగళవారం అరెస్ట్ చేసి గౌరవ కోర్టులో హాజరుపరచగా గౌరవ మెజిస్ట్రేట్ 14 రోజుల కస్టడీని విధించి రిమాండ్ కు తరలించారు. మిగితా (A1) నూగూరి శారద అలియాస్ తుమ్మల శోభ, (A2)దుద్దేల శ్రీధర్ S/o.వెంకట స్వామి తో పాటు A3, A5, A6 లు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.