స్థానిక సంస్థల్లో 42శాతం బీసీ రిజర్వేషన్‌తోనే ఎన్నికలు
` రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం
` సెప్టెంబర్‌లోగా స్థానిక ఎన్నికల నిర్వహణకు అంగీకారం
` అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం
` మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం రికవరీ కోసం వ్యాపారులపై పీడీ యాక్ట్
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని నిర్ణయించింది. పంచాయతీ రాజ్ చట్టం2018 సవరణకు ఆమోదం తెలిపిన కేబినెట్.. రిజర్వేషన్ల పరిమితిపై గత ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. అసెంబ్లీ తర్వాత ప్రత్యేక జీవో తెచ్చి కులగణన ఆధారంగా తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తోంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెర దింపింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో శనివారం భేటీ- అయిన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు చేసింది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో పరిమితి ఎత్తివేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం పేర్లను గవర్నర్‌కు క్యాబినెట్ సిఫార్సు చేసింది. అసెంబ్లీ కమిటీ- హాలులో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంతోపాటు-, ఇటీ-వలి వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపైనా చర్చించారు. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థికశాఖ సాయం కోరుతూ తీర్మానం చేశారు. కేబినేట్ వివరాలను మంత్రి పొంగులేటి విూడియాకు వివరించారు. మరోవైపు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా క్యేబినెట్ నిర్ణయం తీసుకుందని అన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్‌లోగా జరపాలని కోర్డు ఆదేశించింది. మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించకూడదని గత ప్రభుత్వం 2018 ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనిపై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసి గవర్నర్ కు పంపింది. ప్రస్తుతం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండిరగ్ లో ఉందన్నారు. ముస్లీం కోటా పేరుతో బీజేపీ బిల్లును అడ్డుకుంటోంది. రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా ప్రధాని మోదీ సర్కార్ అడ్డుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపాలని ఢల్లీిలో నిరసన కూడా తెలిపినట్లు వెల్లడంచారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ లుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను సిఫారసు చేస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుతో కేబినెట్ మరోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పేర్లను సిఫారసు చేసింది. అయితే కోదండరాం పేరుతో పాటు- ఈ సారి అవిూర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ కు స్థానం కల్పించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమిర్ అలీఖాన్ నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ 2024 ఆగస్టులో సుప్రీంకోర్టులో సివిల్ అప్లికేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో ప్రొఫెసర్ కోదండరాం, ఆమిర్ అలీ ఖాన్ కేసు విషయంలో 2025 ఆగస్టు 13 న స్టే విధించింది. 2024 ఆగస్టు 14న తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల తర్వాత జరిగిన పరిణామాలు ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉంటే ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేస్తామని వ్యాఖ్యానించింది. అయితే.. ఏదైనా తుది ఉత్తర్వులకు లోబడే ఉంటుందని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను 2025 సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. ఈ క్రమంలో మరోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పేర్లను సిఫారసు చేసింది తెలంగాణ కేబినెట్.. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఖరారు చేసింది. అయితే ఈ సారి అవిూర్ అలీ ఖాన్ ప్లేసులో అజారుద్దీన్ కు అవకాశం కల్పించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున కొత్త అభ్యర్థికి అవకాశం రానుంది. ఇకపోతే బీసీ రిజర్వేషన్లపై కేబినెట్‌లో కీలక చర్చ జరిగిందని, అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లులను ఆమోదిస్తాం అని పొంగులేటి అన్నారు. భారీ వర్షాలతో కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. పంట, ఆస్తి, రహదారుల నష్టం అధికంగా జరిగింది. వరద నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు చెప్పాం. వర్షాల వల్ల జరిగిన నష్టం అంచనాల పై సెప్టెంబర్ 4న ఉన్నతాధికారుల సమావేశం నిర్వహిస్తాం అన్నారు. గోలల పాలసీ విధి విధానాలపై చర్చించాం. 2022 – 23 లో రబీ ధాన్యం సేకరణకు టెండర్లు పిలిచారు. మిల్లర్లకు ఇచ్చిన 7లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రికవరీ కాలేదు.. వారి పై పీడీ యాక్ట్ పెట్టడాని-కై-నా ప్రభుత్వం వెనకాడదు. మత్స్య సహకార సంఘాలకు పర్సనల్ ఇంచార్జీలను నియమించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు.