
హైదరాబాద్ (జనంసాక్షి) : జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా తెలంగాణ పౌర సమాజం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా జడ్జీలు, ప్రముఖ న్యాయవాదులు, తెలంగాణ పౌర హక్కుల నేతలు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు సమావేశానికి హాజరుకానున్నారు. మౌనం వీడుదాం.. మన బిడ్డకు అండగా గొంతు విప్పుదాం అనే పేరిట జరగనున్న చర్చలో భాగంగా, వెంకయ్య నాయుడు తెలుగువాడైనప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎందుకు కాకుండా పోయారనే అంశంపై వక్తలు ప్రసగించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి నిర్వహించనున్న ఈ సమావేశాన్ని సీనియర్ జర్నలిస్టు ఎంఎం రహమాన్ (9848328698) సమన్వయం చేయనున్నారు. అందరూ ఆహ్వానితులే.