ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు..

` 50కి.మీ మేర ట్రాఫిక్‌ జామ్‌
న్యూఢల్లీి(జనంసాక్షి):ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పర్వత ప్రాంతాల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్లు మూసుకుపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిరది.చండీగఢ్‌- కులూమనాలి జాతీయ రహదారి పలుచోట్ల బ్లాక్‌ అయ్యింది. దీంతో వేలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడిరచారు. సుమారు 50 కి.మీ మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయినట్లు చెప్పారు. దేశ రాజధాని దిల్లీకి ఈ మార్గంలోనే ఎక్కువగా పండ్లు, కూరగాయలు రవాణా అవుతాయి. దాదాపు ఆ ట్రక్కులన్నీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. దీంతో ప్రయాణికులను నిలిపివేసి.. నిత్యావసర వస్తువుల రవాణాకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. సాధారణ ప్రయాణికులు గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో వారంతా ఆందోళనకు దిగారు. అధికారులు కలగజేసుకొని వారికి సర్దిచెప్పి ట్రాఫిక్‌ను చక్కదిద్దుతున్నారు. మండి- కులూ మధ్యనే దాదాపు 12 చోట్ల కొండ చరియలు విరిగిపడినట్లు అధికారులు చెబుతున్నారు. బియాస్‌ నదీ ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల కులూ-మనాలి మధ్య పలుచోట్ల రహదారి కోతకు గురైనట్లు ఎన్‌హెచ్‌ఏఐ ఇంజినీర్‌ అశోక్‌చౌహాన్‌ తెలిపారు. పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. తాజా పరిస్థితులను దృష్టిలోఉంచుకొని విహార యాత్రలు ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు.