ఉపాధి కూలీల ధర్నా

నర్సింహులపేట, మే25 (జనంసాక్షి):
మండలంలోని పెద్ద నాగారం శివారు గ్యాంగు తండా వాసులు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంకు తాళం వేశారు. వివరాలోకి వెలితే తండాలో గత కొన్ని వారులుగా ప్రజలు మంచి నీరు, వీది లైట్లు సమస్యలతో సతమతమవుతున్నామని ప్రత్యేకాధికారి, స్పేషల్‌ ఆఫిసర్లకు ఎన్ని మార్లు తెలిపిన తమ గోడు వినిపించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ఉపాధి హామి పనులకు వెళితే రోజుకు రూ.40 వస్తున్నాయని ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. గత మూడు వారం రోజులుగా ఉపాధి కూలీకి వెళ్తే రూ. 200 వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం రోజుకు కనీస కూలీ రూ.110 అంటుంటే తమకు రూ.40 నుండి 80 వరకు చెలిస్తున్నారని ఆగ్రహంతో ఎంపిడీవో కార్యాలయంకు తాళం వేసి అధికారులను నిర్భందించారు. ఈ కార్యక్రమంలో జి.వాయ్య, వెంకన్న, రత్తిరాం, జామ్లా, భీమా, ఓమ్లా, వెంకటీ, సురేష్‌ మరో 50 మంది ఉపాధి కూలీలు ధర్నా చేశారు.