*ఉపాధి హామీ పధకం పనిచేసే కూలీల వేలి ముద్రలు పడని, వేతనాలు అందని వారికి ఎంపిడివో ఆఫీస్ లో అప్డేట్ చేసుకోవచ్చు.ఎంపీపీ భూక్యా గోపాల్ నాయక్.

పాలకీడు(జనంసాక్షి)న్యూస్.మండలంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసి వేలిముద్రలు పడక వేతనాలు అందని వారికి  మండల పరిషత్ కార్యాలయంలో పరిష్కారం లభిస్తుందని ఎంపీపీ భూక్యా  గోపాల్ నాయక్ సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు,కూలీలు ఆధార్ కార్డు,జాబ్ కార్డ్,బ్యాంక్ అకౌంట్ బుక్ జిరాక్స్ కాపీలతో మండల పరిషత్ కార్యాలయంలో అప్డేట్ చేయించుకొనే అవకాశం ఉందని తెలిపారు.ఆ తరువాత సమీప పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు నుండి ఉపాధి హామీ డబ్బులు పొందవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడివో శ్రీనివాస్ రెడ్డి,ఎపిఓ సందీప్ రెడ్డి,టైపిస్ట్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.