ఎఫ్‌ఆర్‌బీఎం అదనపు రుణం పొందేందుకు తెలంగాణ సర్కారు అర్హత
హైదరాబాద్,నవంబరు 12(జనంసాక్షి):మూలధన వ్యయలక్ష్యం సాధించిన రాష్ట్రాలకు అదనపు రుణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. రెండో త్రైమాసికంలో ఏడు రాష్ట్రాలు లక్ష్యం సాధించి కేంద్రం అనుమతి పొందాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎంకు అదనంగా రూ.16,691 కోట్ల రుణానికి కేంద్రం అనుమతించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కేరళ రాష్ట్రాలు అదనపు రుణానికి అర్హత పొందిన రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం రూ.5,392 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు అనుమతి లభించింది. మిగతా రాష్ట్రాలన్నీ మూలధన వ్యయ లక్ష్య సాధనలో వెనకబడ్డాయని కేంద్రం తెలిపింది. ఆస్తుల సృష్టిలో వెనుకబాటుతో ఏపీ అర్హత సాధించలేకపోయిందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.