ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సిరిసిల్లకు తరలింపు

కరీంనగర్‌: నిజామాబాద్‌ జిల్లాలో అరెస్టు చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావును పోలీసులు కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లకు తరలించారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్‌ ఎదుట తెరాస కార్యకర్తలతో కలిసి విద్యాసాగర్‌ ఆందోళనకు దిగారు.