-->

ఎస్ ఆర్ ఆర్ తోటలో శ్రీ దుర్గాదేవి ఉత్సవాలు ప్రారంభం

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 26(జనం సాక్షి)
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఎస్ఆర్ఆర్ తోటలో గల దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు శ్రీ దుర్గా మాత శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభం అయినవి .అర్చకులు పాలకుర్తి ఆంజనేయ శర్మ గారి ఆధ్వర్యంలో  ద్వజా రోహనంతో ప్రారంభము అయినవి. మొదటి రోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గా దేవి అలంకారం లో దర్శనం ఇచ్చారు.ఉదయం కలశ స్థాపన చతుపుష్ప పూజలు,అగ్ని ప్రతిష్టాపన జరిగింది.అమ్మవారు సన్నిధిలో ప్రతి రోజు పూజలు హోమాలు నిర్వహించ బడుతాయి అని దేవాలయ కమిటీ అధ్యక్షులు ,కమిటీ సభ్యులు తెలిపారు.
2 Attachments • Scanned by Gmail