*ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి,సంక్షేమమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం*
బయ్యారం,సెప్టెంబర్11(జనంసాక్షి ):
మారుమూల ప్రాంతం నుండి ప్రజలు పోలీస్ స్టేషన్ ను సంప్రదించినప్పుడు, వారికి ఎల్లపుడూ అందుబాటులో ఉంటూ, సహాయం అందిస్తామని బయ్యారం పోలీస్ స్పష్టం చేశారు.
బయ్యారం మండల పరిధిలోని గ్రామాలలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు m
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇటీవల గిరిజన ప్రాంతాల్లో మావోయిస్ట్ లు సంచరిస్తున్నట్లు తెలిసిందని, కావున యువతీ, యువకులు మావోయిస్టు/తీవ్రవాద కార్యకలాపాలకు దోహదపడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రాంతంలో మావోయిస్టు దళ సభ్యుల కదలికలు ఉన్నట్లు దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వము బడుగు బలహీన వర్గాలకు, ఆదివాసి ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని,గతంలో అనుభవించిన చెడు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని ఆదిలోనే మావోయిస్టుల ఆగడాల ఉనికికి అడ్డుకట్ట వేయాలన్నారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వం, పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలని,
మీ ప్రాంత సమస్యలు జిల్లా పాలనాదికారితో చర్చించి, పరస్పర సహకారంతో సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టత ఇచ్చారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మావోయిస్ట్ అనుమానిత వ్యక్తుల పోస్టర్ ను విడుదల చేసారు. ఈ వ్యక్తులు బయ్యారం, కొత్తగూడ, గంగారం మండల అటవీ ప్రాంతాలలో సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని, అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పైన తెల్పిన పోస్టర్ లో ఉన్న జిల్లా అధికారులకు,పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని, అలాగే డయల్ 100 కి కాల్ చేసి తెలియజేయాలన్నారు.అలా తెలిపిన వారి వివరాలు రహస్యంగా ఉంచబడుతాయన్నారు. వారికి తగిన బహుమతి ఇవ్వబడుతుందని చెప్పారు.