ఓటర్ జాబితాల సవరణపై అవగాహన సదస్సు – తహాశీల్దార్ సతీష్‌కుమార్
శంకరపట్నం, జూలై 21, (జనంసాక్షి):శంకరపట్నం మండల పరిధిలోని గ్రామాలకు చెందిన ఓటర్ల జాబితాల సవరణపై అవగాహన సదస్సు శనివారం మండలంలోని స్థానిక తహాశీ ల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహాశీల్దార్ సతీష్‌కుమార్ మాట్లాడు తూ గ్రామ కార్యదర్శులు, రెవెన్యూ కార్యదర్శులు, అంగన్ వాడీ టీచర్లకు గ్రామాలల్లో ఇల్లు ఇల్లు తిరుగుతూ అ కుటుంబంలోని సభ్యుల సంఖ్య, వారి పుట్టిన తేది, పేరు, చిరునామాలో ఏమైన తప్పులు దొర్లినట్లయితే వాటిని సేకరించి, సేకరిం చిన సమాచారాన్ని తహాశీల్దార్ దృష్టికి తీసుకు రావాలని ఆయన తెలిపారు. కొత్తగా నమోదు చేసుకొనే అభ్యర్థులు తమ వయస్సు 18సం వత్సరాలు నిండిన వారై ఉండాలని తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో గల 18సంవ త్సరాలు నిండిన యువతి, యువకుల పేర్లను, చిరునామాలను, పుట్టిన తేదిని ఆ గ్రామాలకు చెందిన గ్రామ కార్యదర్శులు సేకరించాలని ఆయ న సూచించారు.
పారిశుద్ద్యంలో భాగంగా
ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలి…
శంకరపట్నం మండలంలోని స్థానిక తహాశీల్దార్ కార్యాలయంలో తహాశీల్దార్ సతీష్‌కుమార్ పారి శుద్ద్యంలో భాగంగా ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఆయన అన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని గ్రామ కార్యదర్శులు మరుగుదొడ్డి లేనటువంటి ఇంటిం టికి తిరుగుతూ పారిశుద్ద్యంపై అవగాహన ఏర్పా టు చేసి, మరుగుదొడ్డి నిర్మాణాల వలన ప్రజలకు కలిగే లాభాలను గురించి తెలియజేయాలని ఆయ న గ్రామ కార్యదర్శులకు సూచించారు. ఈ కార్య క్రమంలో ఆర్‌ఐలు రజిని, మనోజ్, గ్రామ కార్య దర్శులు, గ్రామ రెవెన్యూ కార్యదర్శులు, అంగన వాడీ టీచర్లు పాల్గొన్నారు.