ఓ మోస్తారుగా సాగు
కందుకూరు , జూలై 28 : మండలంలో ప్రకృతి అనుకూలించక పోయినా రైతులు ఓ మోస్తారుగా పంటలు సాగు చేశారని మండల వ్యవసాయ శాఖాధికారి ఎఓ రాము తెలిపారు. మండల పరిధిలో ప్రస్తుతం 300 ఎకరాల్లో వరి, 300 ఎకరాల్లో కంది, 70 ఎకరాల్లో పెసర రైతులు సాగు చేసినట్లు ఆయన తెలిపారు. మరో 150 ఎకరాల్లో వరి సాగు చేసేందుకు 300 ఎకరాల్లో కంది సాగు చేసేందుకు రైతులు సిద్దపడుతున్నట్లు ఆయన తెలిపారు.