లగచర్లలో భూసేకరణ రద్దు

హైదరాబాద్ (జనంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ నోటిఫికేషను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్ కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన న్ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషనన్ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆగస్టు 1న తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ను జారీ చేసింది.