కులాంతర వివాహం చేసుకున్న మహిళా కానిస్టేబుల్ హత్య

అబ్దుల్లాపూర్ మెట్ (జనంసాక్షి) : ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో సొంత అక్కను తమ్ముడే నరికి చంపాడు. కొంగర మాసయ్య కూతురు నాగమణి (28) హయత్‌నగర్ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. గత రెండు వారాల క్రితం ఓ అబ్బాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. ఊళ్లో తమ పరువు తీసిందంటూ ఆమె తమ్ముడు పరమేష్ కక్షపెంచుకున్నాడు. ఈ క్రమంలో స్టేషన్‌కు స్కూటీ‌పై వెళ్తున్న నాగమణిని రాయపోలు-మన్నెగూడ సమీపంలో కారుతో బలంగా ఢీకొట్టాడు. కింద పడిపోయిన నాగమణిను దారుణంగా కత్తితో దారుణంగా నరికేశాడు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.