మహిళలపై హింసను ఖండించిన చైతన్య మహిళా సంఘం
హైదరాబాద్ (జనంసాక్షి) : మహిళలపై హింసను అరికట్టాలని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చట్టాలు పక్కాగా అమలు చేయాలని చైతన్య మహిళా సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింసను ఖండించే కార్యక్రమాన్ని చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అరుణ, శ్రీదేవి, సత్య,జయ గిరిజ, సవిత, తిరుమల, విరసం నుంచి సత్యం గారు పాల్గొని, జయ, సత్యం ప్రసంగించారు.