రైతులపైకి దూసుకెళ్లిన లారీ.. 10 మంది మృతి

చేవెళ్ల (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల మండల పరిధిలోని ఆర్డర్ గేట్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు అమ్మే రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు పదిమంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో మొత్తం 50 మంది చిరువ్యాపారులు ఉన్నట్లు తెలుస్తోంది. కొందరి మృతదేహాలు ఛిద్రమయ్యాయి.