కడుపునొప్పి బరించలేక ఆత్మహత్య

జగిత్యాలటౌన్‌, 18జూన్‌ (జనంసాక్షి):
జగిత్యాల పట్టణంలోని విద్యానగర్‌కు చెందనచిట్నేని పూర్నచందర్‌రావు(19) కడుపునొప్పి బరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పూర్ణచందర్‌రావు మేడిపెల్లిలోనిపెట్రోల్‌బంక్‌లో పనిచే యుచున్నాడు.  కొద్దిరోజులుగా కడుపు నొప్పితో భాదపడుతూ సరియైన వైద్యం చేయించే స్తోమత లేక ఈ నెల 15న ఇంటినుండి వెళ్ళిపోయాడు. కుటుంబసభ్యులుజగిత్యాల సమీప ప్రాంతంలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు దానితో వారు జగిత్యాల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారంరోజు జగిత్యాల గుట్ట రాజేశ్వరస్వామి ఆలయం దగ్గరలో గుర్తుతెలియని శవం లభ్యమవడంతో పూర్ణచందర్‌రావు కుటుంబ సభ్యులకు తెలుపగా వారు మృతదేహాన్ని గుర్తించి, ఈ మృతదేహం పూర్ణచందర్‌రావుదేనని వారు తెలుపడంతో పట్టణ పోలీసులు కేసు నయోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.