కమ్మ సంఘం అధ్వర్యంలో వన భోజనాలు

మియాపూర్‌ : దీప్తిశ్రీ నగర్‌ ధర్మపురి క్షేత్రంలో కమ్మ సంఘం వారు వన భోజనాలు ఏర్పాటు చేశారు. స్థానిక కమ్మ సంఘం అధ్యక్షుడు నూతక్కి పూర్ణచంద్రరావు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కూకట్‌పల్లికి చెందిన పలువురు ప్రముఖులు హజరయ్యారు. కార్యక్రమంలో మహిళలకు, పిల్లలకు నిర్వహించిన వివిధ రకాల క్రీడాపోటీలు అకట్టుకున్నాయి.