కలిసి ఉండేందుకు ఒక్క కారణం చూపండి పరకాలకు వినోద్‌ సవాల్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (జనంసాక్షి): సమైక్యాంధ్ర పేరుతో సమావేశాలు పెడుతూ తెలంగాణకు పరకాల ప్రభాకర్‌ ద్రోహం చేస్తున్నాడని టిఆర్‌ఎస్‌ మండిపడింది. తెలంగాణలో ఆయనకు కనీసం తిరిగే అవకాశం కూడా లేకుండా ప్రజలు చేశారని టిఆర్‌ఎస్‌ నాయకుడు వినోద్‌ కుమార్‌ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రం కలిసి ఉండడానికి రేపటి ఒక్క కారణం చూపాలని ఆయన సవాల్‌ చేశారు.  హైదరాబాద్‌లో ఆయన సభలు పెట్టినప్పుడల్లా ప్రజలు తిరుగుబాటు చేశారని, అందుకే కర్నూలు తదితర
క్వసి ఉ్శడ్శ్షుఖ”..
ప్రాంతాలకు వెళ్ళి విూటింగులు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తమ పార్టీ కోరుకోవడం లేదని వినోద్‌ చెప్పారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణ పట్ల సానుకూలంగా ఉందని తుది నిర్ణయమే తీసుకోవాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌ను కాంగ్రెస్‌ ఒక వివాదాస్పద ప్రాంతంగా చూడటం లేదన్న వినోద్‌, హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమన్నారు. సీమాంధ్ర నేతలు అనవసరంగా హైదరాబాద్‌పై ప్రేమను పెంచుకోవద్దని సూచించారు. విశాలాంధ్ర సభల పేరుతో పరకాల ప్రభాకర్‌ సీమాంధ్ర ప్రజలను తెలంగాణ ప్రజలపై ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. సమైక్యంగా ఉండాలన్న అంశంపై వంద కారణాలు చూపుతామని చెబుతున్న పరకాల తన మేధస్సును ఆ ప్రాంత అభివృద్ధిపై పెట్టాలన్నారు.  వైద్య కళాశాలల్లో సీట్ల కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఈ రోజు ఒక్క కారణం తాను చూపిస్తున్నానని, అటువంటి వేల కారణాలున్నాయని ఆయన సోమవారం విూడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైద్య కళాశాలల్లో సీట్ల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, సీమాంధ్ర మూడు కళాశాలల్లో 50 చొప్పున సీట్లు పెంచి, తెలంగాణ కళాశాలల్లో సీట్లు పెంచకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అని, అధికార యంత్రాంగం సవతి తల్లి ప్రేమ చూపడం కాదా అని అడిగారు. ఈ రోజు ఉత్పన్నమైంది కాబట్టి విడిపోవడానికి తాను ఈ ఒక్క కారణం చూపుతున్నానని ఆయన అన్నారు.