కింగ్‌ఫిషర్‌లో కొనసాగుతున్న సమ్మె

ముంబరు : కింగ్‌ ఫిషర్‌లో సమ్మె శనివారం కూడా కొనసాగింది. దీంతో పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. ముంబయి నుంచి మూడు, ఢిల్లీ నుంచి వెళ్లే 25 విమాన సర్వీసులను రద్దు చేసినటుట్ట కింగ్‌ఫిషర్‌ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడంలేదంటూ పైలెట్లు సమ్మెకు దిగిన విషయం విదితమే. అయితే శనివారం 75 శాతం మంది పైలెట్లకు జీతాలు చెల్లించినట్టు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధికారి చెబుతుండగా, పైలెట్లు మాత్రం తమ బ్యాంకు ఖాతాలో జీతాలు జమ కానందుకు నిరసనగా శనివారం నాడు కూడా విధులకు దూరంగా ఉన్నట్టు చెప్పారు.