కుట్టుమిషన్ల గోడౌన్‌లో అగ్నిప్రమాదం
రాంనగర్ : బాకారం లోని విద్యా కుట్టుమిషన్ కంపెనీ గౌడౌన్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 15 లక్షల వరకూ అస్తినష్టం జరిగినట్లు కంపెనీ యాజమానులు తెలిపారు. సుమారు మూడుగంటలపాటు నాలుగు పైరింజన్లు శ్రమించి మంటలు అర్పాయి. అవరణ ఇరుగ్గా ఉండడంతో ఒక్క పైరింజన్ మాత్రమే పనిచేయడానికి వీలుండడంతో మంటలు అర్పడం ఇబ్బందయినట్లు సిబ్బంది తెలిపారు.