కొత్త కలెక్టర్‌కు అభినందనల వెల్లువ

నిజామాబాద్‌, జూలై 31 : కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌ చోంగ్తూకు జిల్లా సంయుక్త కలెక్టర్‌, అదనపు జెసి, డిఆర్‌వో పలువురు జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఉదయం కలెక్టర్‌ చాంబరులో ఆమె జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం సంయుక్త కలెక్టర్‌ హర్షవర్ధన్‌, అదనపు జేసీి శ్రీరాంరెడ్డి, డిఆర్‌వో జగదీశ్వరాచారిలతో జిల్లాకు సంబంధించిన నైసర్గిక స్వరూపం, భౌగోళిక పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా పౌర సరఫరాలు, ప్రజల అవసరాలు, జిల్లా ప్రజల ముఖ్య వృత్తి, వ్యవసాయ పరిస్థితులు, ముఖ్యమైన అంశాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా మీ సేవ ద్వారా లక్ష ధృవపత్రాలు జారీ చేశామని, భూ భారతి పనులు ఏరియల్‌ ఫోటో గ్రాఫి సర్వే పూర్తి అయిందని, సర్వేకు- అందుబాటులో ఉన్న రికార్డులను సరిచేసుకోవాలసి ఉందని జెసి వివరించారు.
అన్ని శాఖలకు ఒకే చోట పరిపాలనా కార్యక్రమాలు కొనసాగించడానికి అనువైన సమీకృత భవన సముదాయానికి గతంలో రూపొందించిన ప్రతి పాదనలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ భవన సముదాయానికి గతంలో రూపొందించిన ప్రతిపాదనలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులు జిల్లా కలెక్టర్‌ను సాదరంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయా శాఖల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్లుప్తంగా వివరించారు. కలెక్టర్‌ను సాదరంగా కలిసిన అధికారులలో ఆర్‌విఎం, పివో గురుమూర్తి, డ్వామా, ఎన్‌సిఎల్‌పి పిడిలు వెంకటేశంచ వీరాచారి, సుధాకర్‌, సాయిలు, ప్రసాద్‌, అధికారి రాంచందర్‌రావు, తులసిబాయి, పౌర సరఫరాల డిఎం పిచ్చయ్య, డిటి సూర్యప్రకాష్‌, కలెక్టరేట్‌ కార్యాలయ ఎవో గంగాధర్‌ తదితరులు ఉన్నారు.