కొహెడను సందర్శించిన శిక్షణ బృందం

కొహెడ: కేంద్ర సచివాలయానికి చెందిన శిక్షణ బృందం (ఏఎన్‌వో) బుధవారం కొహెడను సందర్శించింది. నిర్మల్‌ గ్రామీణ పురస్కార్‌ అవార్డు గ్రామంగా ఎన్నికైన రామచిన్నాపూర్‌ గ్రామాన్ని వారు సందర్శించారు. అనంతరం మండల పరిషత్తు కార్యాలయంలో 105 మంది సభ్యుల బృందానికి ఎంపీడీవో సదానందరావు గ్రామాల్లోని అభివృద్ధి పథకాల అమలును వారికి వివరించారు. రామచిన్నాపూర్‌ గ్రామంలో మాజీ సర్పంచి భానుప్రకాశ్‌ బృందానికి స్వాగతం పలికారు.